“మనసా.. వాచా” సినిమా రివ్యూ

నటీనటులు:
తేజస్
కరిష్మా కర్పాల్
సీమా పరమార్
తాగుబోతు రమేష్
తదితరులు..

సాంకేతికవర్గం:
సంగీతం: కేశవ్ కిరణ్,
మాటలు-పాటలు: అరుణ్ బుర్రా
స్క్రీన్ ప్లే: రఘునాధ్ సముద్రాల, అరుణ్ బుర్రా, ఎం.వి.ప్రసాద్
నిర్మాతలు: నిశ్చల్ దేవా-లండన్ గణేష్
కథ-కథనం-దర్శకత్వం: ఎం.వి.ప్రసాద్
నిర్మాణసంస్థ: గణేష్ క్రియేషన్స్
రిలీజ్: ‘ఎం.జి.ఎం’ అచ్చిబాబు
విడుదల తేది: మార్చి 15, 2019

కధ :

చైతూ (తేజస్), స్వాతి (కరిష్మా కార్పల్ ) రీసెర్చ్ స్కాలర్స్ గా లండన్ లోని ఒక మెడికల్ ఇనిస్టిట్యూట్ లో పనిచేస్తుంటారు. ఈ క్రమంలో స్వాతి ని ఇంప్రెస్ చేసి ఆమె ను లవ్ లో పడేయడానికి ట్రై చేస్తాడు చైతూ. ఈ క్రమంలో క్యాన్సర్ ను సులభంగా నయం చేసుకునేలా మందును కనిపెట్టి స్వాతిని ఇంప్రెస్ చేసి ఆమె ను లవ్ చేసేలా చేస్తాడు. ఈక్రమంలో ,చైతూ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు? ఇంతకీ చైతూ ని కిడ్నాప్ చేయడానికి గల కారణాలు ఏమిటి ? ఆతరువాత మళ్ళీ చైతూ , స్వాతి కలిసారా ? అనేదే మిగితా కథ.

కథనం:
కాన్సర్ రీసెర్చ్ సైంటిస్ట్స్ గా పని చేసే ఇద్దరు ఎన్. ఆర్.ఐల మధ్య లండన్ బ్యాక్ డ్రాప్ లో నడిచే అందమైన ప్రేమ కథ ఇది. మహమ్మారిలా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కాన్సర్ కు అతి తేలికైన నివారణ కనుక్కుంటున్న క్రమంలో.. ఈరోజు యావత్ ప్రపంచాన్ని శాసిస్తున్న మెడికల్ మాఫియా వల్ల వాళ్ళ ప్రేమకు, వారి జీవితాలను ఎదురైన ప్రతిబంధకాల సమాహారమే… ‘మనసా వాచా’.
నటీనటుల పనితీరు:
హీరోహీరోయిన్లు (తేజస్-కరిష్మా కర్పాల్, సీమా పరమార్) కొత్తవాళ్ళైనా.. చాలా చక్కగా నటించారు. ఇద్దరిలోనూ మంచి ఈజ్ కనిపించింది. మిగతా పాత్రల్లో నటించిన లండన్ గణేష్, తాగుబోతు రమేష్, నవీన్ తదితరులు కూడా పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతికవర్గం పనితీరు:
ఈ సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది స్క్రీన్ ప్లే గురించి.. ఆ తర్వాత సినిమాటోగ్రఫీ గురించి. లండన్ అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేస్తూనే.. సీన్స్ కి తగ్గ మూడ్ ఎలివేట్ చేస్తూ.. సినిమాకి జీవం పోసింది. ఇక దర్శకుడి విషయానికొస్తే.. “ఎం.వి.ప్రసాద్” అనే అతని పేరు ముందు ముందు మరింతగా వినిపించడం ఖాయం. పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎంపిక చేసుకోడం మొదలుకుని.. అందరి నుంచి మంచి ఔట్ పుట్ తీసుకోవడంలో పూర్తిగా సఫలీకృతమయ్యాడు. కథను ఆద్యంతం ఆసక్తిగా మలచడంలోనూ బాగా సక్సెస్ అయ్యాడు. ముఖ్యాంగా సెకండాఫ్ లో వచ్చే మలుపులు కోసం తప్పనిసరిగా చూసి తీరాల్సిన సినిమా ఇది. కేశవ్ కిరణ్ అందించిన బాణీలతోపాటు నేపధ్య సంగీతం బాగుంది. అరుణ్ బుర్రా మాటలు, పాటలు కూడా మంచి మార్కులే తెచ్చుకుంటాయి. అయితే ఎడిటింగ్ మరి కొంచెం షార్ప్ గా ఉండి ఉంటే ఇంకా బాగుండేదనిపిస్తుంది.
ఇకపోతే.. నవ్యతకు పెద్ద పీట వేసే ఇటువంటి సరి కొత్త కదాంశం తో ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాతలు నిశ్చల్ దేవా, లండన్ గణేష్ లను అభినందించాలి.

చివరిగా: ప్రోత్సహించదగ్గ ఒక మంచి ప్రయత్నం. వైవిద్యవంతమైన కథలతో రూపొందే సినిమాలను ఆదరించేవారు మిస్ అవ్వకూడని సినిమా.
Rating :3/5

Related posts

Leave a Comment