మార్చి 15 న విడుదలకు సిద్దమయిన మ్యాగ్నేట్ చిత్రం

మార్చి 15 న విడుదలకు సిద్దమయిన మ్యాగ్నేట్ చిత్రం ప్రీరిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకకు హీరోయిన్ సాక్షి చౌదరి, హీరో అభినవ్ సర్దార్ సంగీత దర్శకుడు కిషన్ కావాడియా కెమెరా మెన్ కె శంకర్, పాటల రచయిత మౌనశ్రీ మల్లిక్ తదితరులు హాజరయ్యారు. ముఖ్యఅతిదిగా హాజరయిన సి కళ్యాణ్ మాట్లాడుతూ మ్యాగ్నేట్ టైటిల్ చిత్రం ట్రైలర్ చూస్తుంటే టైటిల్ కి తగ్గట్టుగానే ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ఉంది ఈ సినిమా. చిన్న సినిమా బ్రతకాలి. చిన్న సినిమాను ప్రేక్షకులే చంపేస్తున్నారు. ఆడియెన్స్ చిన్న సినిమాను సపోర్ట్ చేయాలి. ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి నిర్మాత, ప్రతి దర్శకుడు ఒకప్పుడు చిన్న సినిమాలు తీసే ఈ స్థాయికి వచ్చారు. సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కూడా సినిమా ప్రచారంలో బాగం అవ్వాలి. అప్పుడే సినిమా స్థాయి ఏంటో ప్రేక్షకుడికి కూడా అర్ధమవుతుంది. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అని కొనియాడారు.
దర్శకుడు ఆది శేషా సాయి రెడ్డి మాట్లాడుతూ, ఈ సినిమా తీస్తున్నప్పుడు నేను పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు, వాటి అన్నిటిని అధిగమించి ఈ సినిమా ఈ రోజు మీ ముందు నిలుపుతున్నాను. పిల్లలను తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వాళ్ళ జీవితాలు ఏలా నాశనం అవుతాయి అనేది ముఖ్యకథ. నాకు ఈ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా రమ్మని చాలా మందిని అడిగా, ముందు అందరూ వస్తాం అన్నారు, తరువాత రాలేం అన్నారు, ఒక్క సి కళ్యాణ్ గారు మాత్రమే, వస్తా అని చెప్పారు, వచ్చారు. మీ సహాయం ఏప్పటికి మర్చిపోను సార్, నా సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్ కి నా ధన్యవాధాలు. మా సినిమా ఈ 15 న విడుదల అవుతుంది అని తెలిపారు.
హీరోయిన్ సాక్షి చౌదరి మాట్లాడుతూ, ఈ సినిమా చేస్తున్నపుడు నాకు హైదరాబాద్ లా అయిపొయింది. ఈ సినిమా గ్యారెంటి హిట్ అవుతుంది. ఈ సినిమా హిట్ తరువాత హైదరాబాద్ లో స్వంత ఇల్లు కొంటా. అంత నమ్మకం ఉంది నాకు. ఈ సినిమా ట్రైలర్ లో నా ఫైట్స్ చూసి నాకు చాలా కాల్స్ వచ్చాయి. అంతా దర్శకుడు పడిన కష్టానికి ప్రతిపలం ఇది. మా టీం నీ అభినందించటానికి వచ్చిన గెస్ట్ లకు ధన్యవాదాలు అని తెలిపారు.

అభినవ్ సర్దార్ మాట్లాడుతూ, సినిమా చాలా బాగా వచ్చింది, ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.

సంగీత దర్శకుడు కిషన్ కావాడియ మాట్లాడుతూ ఈ సినిమాతో నాకు మరో హిట్ అందడం గ్యారెంటి. మా సినిమా అంత మంచిగా వచ్చింది. ఈ రోజు సినిమాపై ఉన్న అంచనాలకు చాలా ఆనందంగా ఉన్నాం అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వెలిగొండ శ్రీనివాస్, డిస్త్రిబుటార్ నవీన్, దర్శకుడు లారెన్స్ పాల్గొన్నారు.

Related posts

Leave a Comment