“ఏదైనా జరగొచ్చు” అందరికీ నచ్చుతుంది – దర్శకుడు రమాకాంత్

“ఏదైనా జరగొచ్చు” దర్శకుడు రమాకాంత్ ఇంటర్వ్యూ

Q : శివాజీ రాజా అబ్బాయి ని ఎలా ఎంచుకున్నారు… ?
రమాకాంత్ : విజయ్ రాజ్ తో పాటు కొత్తవాళ్ల తోనె వెళ్తే ఇది నాకు సెట్ అవుతుంది అని మొత్తం క్రొత్త వాళ్ళను తీసుకున్న.

Q :ఏదైనా జరగొచ్చు కథ ఏంటి…
రమాకాంత్ :ఇది కంప్లీట్ ప్యూర్ స్టోరీ, ఫిక్షన్ స్టోరీ… ఏప్రిల్ 1stన పుట్టిన ముగ్గురు కుర్రాళ్ళు ఏ పని చేసిన తేడా కొడుతోంది ,అసలు ఎందుకు అలా జరుగుతుంది అనేదే కథ …డార్క్ కామెడీ తో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

Q :బాబీ సింహ ని ఎందుకు తీసుకున్నారు….?
రమాకాంత్ :ఇది చాలా ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఉన్న లవ్ స్టొరీ ,దీనికి ఆయన తప్ప ఇంకా ఎవరు చేయలేరు.నా ఫస్ట్ సీట్టింగ్ లొనే కధ నచ్చి ఆయన ఒప్పుకున్నారు.

Q :చంద్రశేఖర్ యేలేటి గారు చూసారా….?
రమాకాంత్ :ఆయన చూసారు చాలా నచ్చింది కూడా  ఆయనకు….

Q :వెన్నెల కిషోర్ ఎపిసోడ్ ఏంటి….?
రమాకాంత్ :మాడ్ డైరెక్టర్ క్యారెక్టర్ చేసాడు వెన్నెల కిషోర్ చాలా బాగా పేలింది కూడా.

Q :ఇంత లేట్ ఎందుకు అయ్యింది మీకు డైరెక్ట్ చేయటానికి….?
రమాకాంత్ :చంద్రశేఖర్ యేలేటి గారి దగ్గర 9 ఏళ్ళు మూడు సినిమాలు చేసాను చాలా నేర్చుకున్నాను, ఇప్పటికి నాకు కుదిరింది.

Q :ఈ సినిమా తరువాత….?
రమాకాంత్ : కథలు ఉన్నాయి చూడాలి, ఈ సినిమా తరువాత తెలుస్తోంది.

Q : ప్రేక్షకులకు మీరు ఏమి చెప్తారు…?
ఆగస్ట్23న మీ ముందుకు వస్తుంది కాబట్టి అందరూ ఆదరిస్తారు అని ఆసిస్తూ ఉన్నాము.

Leave a Comment