“స్వాగతం కృష్ణా” ఇండిపెండెంట్ మూవీ రివ్యూ

బ్యానర్ :నేత్ర ఎంటర్టైన్మెంట్
కాస్టింగ్ : చైతన్య, అల్కా రాథోడ్…
మ్యూజిక్ :లీనస్ మదిరి
కెమెరా :సతీష్ రెడ్డి
ప్రొడ్యూసర్ :టుంకూర్ హరిక్రిష్ణ
డైరెక్టర్ :రాధాకృష్ణ

నేత్ర ఎంటర్టైన్మెంట్ సమర్పించు పలవర్తి రాధాకృష్ణ దర్శకత్వం చేసిన షార్ట్ ఫిల్మ్ “స్వాగతం కృష్ణా” .ఫీచర్ ఫిల్మ్ ని ఏ మాత్రం తగ్గకుండా తీసిన ఈ షార్ట్ ఫిల్మ్ రివ్యూ ఇప్పుడు చూద్దాం.

కథ :
కృష్ణ (చైతన్య) బాల్యంలోనే తన తల్లిని కోల్పోతాడు.అయితే తల్లి ప్రేమ నోచుకోని కృష్ణ కి తన క్లాస్ మెట్ సుప్రియ (అల్కా రాథోడ్) ద్వారా పొందాలని తనని పెళ్లి చేసుకోవాలని ఎనిమిది ఏళ్ల నుండి తన చుట్టే తిరుగుతూ ఉంటాడు కృష్ణ అయితే సుప్రియ మాత్రం ఇంకో కుర్రాడిని తన వుడ్ బి గా పరిచయం చేస్తుంది… దాంతో షాక్ అవుతాడు కృష్ణ… మరి కృష్ణ కి తాను ప్రాణం గా ప్రేమించే అమ్మాయి ప్రేమ దొరుకుంటుందా లేదా అనేదే అసలు కథ….

విశ్లేషణ :
సినిమా మొదలైన నుండి అసలు షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ మనకు అసలు రాదు.దర్శకుడు రాధాకృష్ణ ఎంచుకున్న కథ చాలా బాగా ప్రెసెంట్ చేసాడు,హీరో కృష్ణ (చైతన్య) అసలు కొత్త కుర్రాడిలా కాకుండా చాలా ప్లసెంట్ గా చేసాడు ,ఇక అమ్మాయి సుప్రియ ఈ కథకే ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు…ఈ అమ్మాయి సినిమాల్లో చేస్తే మంచి గా రాణిస్తుంది అనేలా ఉంది, సతీష్ రెడ్డి కెమేరా వర్క్ బాగుంది ,ఎడిటింగ్ కూడా ఓకే…లీనస్ మదిరి అందించిన మ్యూజిక్ ,ఆర్ ఆర్ సినిమా కి ప్రాణం పోసాయి.

ఒక మంచి లవ్ స్టొరీ చూడలనుకునే ప్రేక్షకులకు “స్వాగతం కృష్ణా” తప్పక నచ్చుతుంది.

రేటింగ్ :3/5

Leave a Comment